SRCLC:TEL;ENG:GT-TEL 1.0 Общество
06.07.2026 Читать источник
Родители в шоке от астрономических сборов в частных школах: плата за обучение и учебники доходит до миллиона рупий

В штате Андхра-Прадеш родители сталкиваются с несоразмерно высокими сборами в частных и корпоративных школах, где стоимость обучения и обязательных учебников может достигать миллиона рупий. Несмотря на нарушения правительственных норм, включая запрет на продажу учебников и требование отводить 25% мест для бедных семей, образовательные власти не предпринимают никаких реальных мер по контролю над ценообразованием.
Перевод ИИ
Текст статьи доступен на языке оригинала.
Нажмите кнопку «Перевести статью» выше, чтобы сгенерировать перевод с помощью ИИ.
Оригинальный контент
Exorbitant fees : నేడు పలు ప్రైవేట్, కార్పొరేట్ స్కూళ్ల, కాలేజీలు ఫీజులు చూస్తే కళ్లు తిరగాల్సిందే. చదువుకునే రోజులు పోయి చదువుకొనే రోజులు వచ్చాయి. బడి తలుపులు తెరిచినా వేళ తల్లిదండ్రుల్లో ఫీజుల టెన్షన్ మొదలైంది. ప్రైవేటు స్కూళ్ళు, కార్పొరేట్ విద్యాసంస్థలలో పుస్తకాలు, ఫీజులు చూస్తుంటే తల్లిదండ్రుల గుండెల్లో రైళ్లు పరుగెడుతున్నాయి. పిల్లల భవిష్యత్తే తమ భవిష్యత్తుగా భావించి అప్పులు చేసి మరీ పిల్లలను చదివిస్తున్నారు. ఎల్. కె.జి నుంచే ఫీజుల బాదుడు భారీగా ఉంటుండడంతో తల్లిదండ్రులు ఏం చేయా లో తెలియక సతమతమవుతున్నారు. జూన్ నెల వచ్చిం దంటే చాలు తల్లిదండ్రుల గుండెల్లో రైళ్లు పరిగెడుతున్నా యి. బడి తలుపులు తెరిచే సమయానికి పిల్లలు చదువు కోసం వేలల్లో, లక్షల్లో సొమ్ములు చూసుకోవాల్సి పరిస్థితి వచ్చింది. విజయవాడలో ఓ కార్పొరేట్ స్కూల్లో పదో తరగతి విద్యార్థికి స్కూల్, హాస్టల్ కలిపి మొత్తం లక్ష రూపాయలు, కొన్ని స్కూళ్లలో ఎల్.కె.జి, యుకెజి ఫీజులే సుమారు రూ.50 వేల నుంచి రూ.1 లక్ష మధ్యలో వసూ లు చేస్తున్నారు. రాష్ట్రంలో కార్పొరేట్ స్కూళ్లు, కాలేజీలు 2026-27 విద్యా సంవత్సరానికి అడ్మిషన్ల ముసుగులో ఫీజుల మోత మోగిస్తున్నాయి.
Read Also : Mumbai rains: వదలని వాన.. ముంబైలో విద్యాసంస్థలకు సెలవు!
Exorbitant fees : తమ రూల్ తమదే
కొన్ని స్కూళ్లలో అయితే అప్పుడే అడ్మిషన్లు పూర్తయిపోయినట్లు చెబుతున్నారు. తమ పిల్లలకు ఇంగ్లిష్ మీడియంలో చదువు చెప్పించాలనే ఉద్దే శ్యంతో అడ్మిషన్ల కోసం ప్రైవేట్ స్కూళ్లకు వెళుతున్న తల్లి దండ్రులు అక్కడి ఫీజులు చూసి, వాటిని కట్టడం తమ వల్ల కాదని నిరాశతో వెనుదిరుగుతున్న పరిస్థితి ఉంది. ప్రభుత్వం ఎన్ని జీవోలు, నిబంధనలు రూపొందించినా తమ రూల్ తమదే అనేలా కార్పొరేట్, ప్రైవేట్ స్కూళ్లు, కాలేజీలు ప్రవర్తిస్తున్నాయి. కొన్ని స్కూళ్లు అయితే ఒకేసారి మొత్తం అడ్మిషన్ ఫీజు, పాఠశాల ఫీజు కట్టాలనే నిబంధన లను అమలు చేస్తున్నాయి. విద్యాహక్కు చట్టం సెక్షన్ 6 ప్రకారం ప్రభుత్వ నిబంధనల ప్రకారం అడ్మిషన్లు జరగాలి. సెక్షన్ 11లో సూచించిన విధంగా ప్రైవేటు పాఠశాలల యాజమాన్యాలు గవర్నింగ్ బాడీ నిర్ణయించిన ఫీజులను మాత్రమే వసూలు చేయాలి. వసూలు చేసే ఫీజుల వివ రాలను నోటీసు బోర్డులో పెట్టాలి. సెక్షన్ 12 ప్రకారం విద్యార్థుల, ఉపాధ్యాయుల నిష్పత్తి 1:20కి మించరాదు. ప్రతి పాఠశాలలో 25శాతం సీట్లను ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగులు, మైనార్టీలకు కేటాయించాలి. ఇందులో వికలాంగులు, అనాథలు, హెచ్ఐవి బాధితులు, వీధి బాలలు 5 శాతం, ఎస్సీబాలలకు 10 శాతం, ఎస్టీబాలలకు 4శాతం, వెనుక బడిన బలహీన వర్గాలు 6శాతం, కేటాయింపు జరిగింది. మొత్తం 25శాతం వీటి ప్రకారం ఎక్కడ కూడా పూర్తి స్థాయిలో అమలు జరగడం లేదు.
కఠినమైన చర్యలు తీసు కోవాలి
సెక్షన్ 18 ప్రకారం ప్రభుత్వ నిర్ణీత గడువు తర్వాత కూడా గుర్తింపులేని పాఠ శాలను నడిపితే ఒక లక్ష జరిమానా విధిస్తారు. ఒకవేళ జరిమానా తర్వాత కూడా గుర్తింపు లేకుండా మళ్లీ పాఠ శాలను నిర్వహిస్తే రోజుకు 10 వేలు జరిమానా విధిస్తారు. సెక్షన్ 13 ప్రకారం ప్రాథమిక స్థాయిలో (ఏ (ప్రవేశ పరీక్ష) నిర్వహించకూడదు. ఒకవేళ అలా నిర్వహిస్తే తొలిసారి తప్పుకు రూ.25వేల, పునరావృతం అయితే రూ.50 వేల జరిమానా విధిస్తారు. ఏ పాఠశాలలోనూ బోధనా రుసుం కాకుండా ఇతర రూపాల్లో ఎలాంటి ఫీజు (క్యాపిటేషన్ ఫీజు) వసూలు చేయరాదు. అలా వసూలు చేస్తే దానికి 10 రెట్లు జరిమానా విధిస్తారు. ప్రైవేటు విద్యాసంస్థలు అక్ర మంగా విద్యాసామగ్రి విక్రయిస్తున్నాయి. విద్యాహక్క చట్టం ప్రకారం ఏ విద్యాసంస్థలలో కూడా పుస్తకాలు, యూనిఫామ్ అమ్మరాదు. అలా చేస్తున్న వారిపై కఠినమైన చర్యలు తీసు కోవాల్సి ఉ న్న వారిపై చర్యలు తీసుకోవడం లేదు. తమ వద్దే యూనిఫామ్, పుస్తకాలు కొనుగోలు చేయాలంటూ అధిక ధరలు విద్యాసంస్థల యాజమాన్యాలు వనూలు చేస్తు న్నారు. కార్పొరేట్ విద్యా సంస్థలు ప్రభుత్వ పెద్దలకు చెందినవి కావడంతో చర్యలు తీసుకోవడానికి అధికారులు వెనుకంజ వేస్తున్నట్లు తెలుస్తోంది. విద్యార్థులు తమకు నచ్చినచోట విద్యాసామగ్రిని తెచ్చుకునే సౌలభ్యం కల్పించా ల్సి ఉంది. విద్యాశాఖ నిబంధనలు ఉల్లంఘిస్తున్న ప్రైవేటు స్కూల్స్్ప అధికారులు చర్యలు తీసుకోవాల్సి ఉంది. విద్య కు అత్యంత ప్రాధాన్యత కల్పించాల్సిన బాధ్యత ప్రభుత్వం పై ఉంది. పాఠశాలల్లో ఆటస్థలం ఉండడం లేదు. ఆటస్థలం ఉన్నప్పటికీ పలు పాఠశాలల్లో పీ. ఈ టీలు ఉండడం లేదు. అనుమతుల సమయంలో బీఈడీ, పీజీ సర్టిఫికేట్లు ఉన్న వారిని చూపించి, అర్హత లేని వారితో పాఠాలు చెప్పిస్తున్నా రన్న విమర్శలు వినిపిస్తున్నాయి.
విద్యాహక్కు చట్టాన్ని పట్టించుకుంటున్న దాఖలా లేదు
పాఠశాల వివరాలు, రికగ్నైజేషన్, రెన్యూవల్ సర్టిఫికేట్లు అందజేయక పోయినప్ప టికీ విద్యాశాఖ అధికారులు పట్టించుకోవడం లేదు. ఈ క్రమంలో ప్రభుత్వ నిబంధనలు అమలు చేయడానికి సరైన ప్రణాళికలు రూపొందంచాలి. ఈస్కూల్ మనోళ్లది అనూ డ్రాల్ వావోళ్లది అనే తేడాలు లేకుండా నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరిస్తున్న వారు ఎంతటి వారైనా చర్యలు తీసుకోవా లి. ప్రైవేట్, కార్పొరేట్ కాలేజీలు, స్కూళ్లలో ఫీజుల నియం త్రణ ప్రభుత్వం నిర్లక్ష్య వైఖరిని ప్రదర్శిస్తోంది. నేడు రాష్ట్రా ల్లో కార్పొరేట్, ప్రైవేట్ స్కూళ్లు మండల స్థాయి వరకు విస్తరించి ఇష్టారాజ్యంగా ఫీజులు వసూలు చేస్తుంటే ప్రభు త్వం, అధికారులు చూసీ చూడనట్టు వ్యవహరిస్తున్నారు. పేద, మధ్యతరగతి తల్లిదండ్రుల కష్టార్జితాన్ని ప్రైవేట్ స్కూల్ యాజమాన్యాలు జలగల్లా పట్టి వారి రక్తాన్ని పీలు స్తున్నాయి. కూటమి ప్రభుత్వం ఫీజు నియంత్రణ కమిటీ వేస్తామని చెప్పినా ఇప్పటివరకు ఎలాంటి నిర్ణయం తీసుకో లేదు. 2009 విద్యాహక్కు చట్టం ప్రకారం ప్రైవేట్, కార్పొ రేట్ స్కూళ్లు మొత్తం సీట్లలో 25 శాతం పేద పిల్లలకు కేటాయించాలి. కానీ రాష్ట్రంలోని ప్రైవేట్, కార్పొరేట్స్కూళ్లు విద్యాహక్కు చట్టాన్ని పట్టించుకుంటున్న దాఖలా లేదు. కార్పొరేట్, ప్రైవేట్ పాఠశాలలపై విద్యాశాఖ అధికారుల పర్యవేక్షణ కనిపించడంలేదు. ప్రైవేట్ పాఠశాలల యాజమా న్యాలు యథేచ్చగా ఫీజుల దందా కొనసాగిస్తున్నా అధికారులు చూసీ చూడనట్టు వ్యవహరిస్తున్నారు. ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం మేల్కొని ప్రైవేట్, కార్పొరేట్ పాఠశాలలపై చర్య లు తీసుకుని ఈ విద్యా సంవత్సరం నుంచే ఫీజు నియంత్రణ చర్యలు తీసుకోవాలి.
-ఎం. సోమేశ్వరరావు
Read hindi news : hindi.vaartha.com
Epaper : epaper.vaartha.com
Read Also:
Аналитика ИИ и парсинга
Технические детали обнаружения, сопоставления и связывания статьи
Поисковый запрос
«карманные школы и колледжи завышают плату за обучение и продают учебники»
Запрос, сгенерированный ИИ для поиска статьи в веб-источниках
Связанные результаты поиска
Результаты поиска отсутствуют в БД
Парсер не сохранил результаты веб-поиска для этой статьи.